Monday, December 23, 2024

ఆస్కార్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘‘రాజుగాని మెల్లోనా సిలకల పేరు నువ్వేనే..

- Advertisement -
- Advertisement -

పెళ్లి చూపులు, బొమ్మలరామారం, ఎగిసే తారాజువ్వలు, జార్జి రెడ్డి చిత్రాలతో పాటు పిట్టకథలు వెబ్ సిరీస్ లోనూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ బేతగంటి. అతను దర్శకుడుగా మారి తెరకెక్కించిన చిత్రం ‘రామన్న యూత్ సిల్లీమాంక్స్ స్టూడియోస్ సమర్పణలో ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రజినీ నిర్మాత. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్టైనింగ్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. తాజాగా ఓ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఇంతకు ముందే ఈ పాటకు సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోతోనే హిట్ సాంగ్ అనిపించుకున్న ఈ గీతాన్ని ప్రస్తుతం సూపర్ హిట్ సాంగ్స్ లిరిసిస్ట్ గా పేరు తెచ్చుకున్న కాసర్ల శ్యామ్ రాశాడు. కమ్రాన్ సంగీతం అందించగా ఆస్కార్ విన్నింగ్ సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు.

‘‘రాజుగాని మెల్లోనా సిలకల పేరు నువ్వేనే.. మోజు పడ్డడే నీపైనే ఓ స్వప్నా.. రాజ్యమేదీ లేకున్నా.. హల్చల్ చేస్తడే ఊళ్లోనే.. రాణిలెక్కనే జూస్తాడే ఓ స్వప్నా.. నువ్వు దారం వీడో బీడీ.. మస్తుంటదే ఇద్దరి జోడీ.. ఇల్లుటమే రమ్మంటొస్తడే’’ అంటూ సాగే ఈ గీతం గ్రామీణ ప్రేమల్లో స్వచ్ఛతను, అమాయకత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించేలా కనిపిస్తోంది. తెలంగాణ పద ప్రయోగాలతో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను వినగానే ఆకట్టుకునేలా ట్యూన్ చేశాడు సంగీత దర్శకుడు. ఆ ట్యూన్ అంతే ఈజ్ తో ఆలపించాడు రాహుల్ సిప్లిగంజ్. కంప్లీట్ క్యాచీ ట్యూన్ తో పూర్తిగా మాంటేజ్ సాంగ్ లా ఉన్న ఈ గీతంలో హీరో, దర్శకుడూ అయిన నవీన్, అమూల్య రెడ్డిల జోడీ అత్యంత సహజంగా ఉంది.

అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న రామన్న యూత్ లో
నటీనటులు : అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు‌ పొలసాని తదితరులు

సాంకేతిక నిపుణులు : కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి, సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి, ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, నవీన్, ఆర్ట్ -‌ లక్ష్మీ సింధూజ, సంగీతం – కమ్రాన్ , సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్
మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్ కే, పీఆర్వో – జీఎస్కే
మీడియా, రచన దర్శకత్వం – నవీన్ బేతిగంటి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News