Wednesday, January 22, 2025

శక్తి టీమ్ పురస్కారాన్ని సాధించిన దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం

- Advertisement -
- Advertisement -

ఘనంగా సత్కరించిన మంత్రి సీతక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే రక్షణ దళానికి మహిళల రక్షణ కేటగిరీ కింద అవార్డును ప్రధానం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు -2024లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు , సీనియర్ సిటిజన్ల విభాగంచేత గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ‘మహిళల రక్షణ కేటగిరీ‘లో దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే రక్షణ దళానికి శక్తి టీం పురస్కారం ప్రధానం చేసింది.

తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ఐజి కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్‌ను అభినందించి రూ 1 లక్ష బహుమతి, ఒక మెమెంటోతో కూడిన అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితా చటోపాధ్యాయ, రైల్వే రక్షణ దళానికి చెందిన మహిళా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సంధర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ అరూమా సింగ్ ఠాకూర్‌లు ఈ మేరకు 24 గంటలూ మహిళా ప్రయాణీకులకు భద్రత కల్పిస్తున్న దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే రక్షణ బృందాన్ని అభినందించారు. బృందం ప్రదర్శించిన ధైర్యసాహసాలు చురుకుదనాన్ని ఆయన ప్రశంసిస్తూ ఇటువంటి చర్యల వలన మన రైల్వే రక్షణ దళం యొక్క ధైర్యాన్ని పెంపొందించడమే కాకుండా ఇతర రైల్వే సిబ్బందిని కూడా అలాంటి ప్రయత్నాలను చేపట్టేలా ప్రోత్సహిస్తుందని తెలియజేశారు.

దక్షిణ మధ్య రైల్వేకు టీమ్ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మరియు అవార్డును అందుకోవడం జోన్ కు గర్వంగా ఉందని తెలియజేశారు. కాగా దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే రక్షణ దళంకు చెందిన శక్తి బృందం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) మహిళా రైల్వే ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థలో నడిచే రైళ్లలో ప్రయాణించే మహిళలు మరియు పిల్లల భద్రత కోసం విధులను నిర్వర్తిస్తున్న శక్తి బృందాన్ని ’రుద్రమ్మ’ మరియు ’నాగమ్మ’ పేరుతో రెండు బృందాలుగా ఏర్పాటు చేశారు . ఈ బృందాలు ప్రయాణిస్తున్న చాలామంది మహిళలకు సహాయం మరియు భద్రతను కలుగజేస్తున్నాయి. ఈ టీమ్లు నిరంతరం నడుస్తున్న రైళ్లలో మరియు రైల్వే స్టేషన్లలో ఉండడంతో పాటు ఆకస్మిక తనిఖీ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తాయి. బృంద సభ్యులు ప్రయాణీకులుగా ప్రవర్తిస్తూ ఎవరైనా నేరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు లేదా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లుగా ఉన్న వారిని గమనించినట్లయితే నేరస్థులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. భారతీయ రైల్వేలో శక్తివంతమైన రైల్వే జోన్గా దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణీకులకు అత్యుత్తమ భద్రతను అందించడంలో గర్విస్తుంది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ శక్తి బృందం అంకితభావంతో మరియు అద్భుతమైన పని తీరుతో మహిళా భద్రత రంగంలో కొత్త రికార్డులను నెలకొల్పింది.

SCR 1

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News