Friday, December 20, 2024

ముందుగానే వానలు

- Advertisement -
- Advertisement -

కేరళను తాకిన నై’రుతు’పవనాలు

మరి మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు.. మూములు కంటే జోరు పుంజుకున్న వానాకాలం

మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు వచ్చేశాయంటూ పగిలే ఎండల్లో వాతవారణ శాఖ చల్లటి కబురందించింది. ఆదివారం ఉదయానికే నైరుతి రుతుపనాలు కేరళలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవి చురుగ్గా కదులుతూ మరో మూడు నా లుగు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. సాధారణ పరిస్థితుల్లో రుతుపవనాలు మే 26న అండమాన్ నికోబార్ దీవులను తాకుతూ జూన్ ఒకటిన దేశంలోకి ప్రవేశిస్తాయి. ఇవి క్రమంగా విస్తరిస్తూ జూన్ 5న కర్ణాటకలోకి , 10న మహారాష్ట్రలోకి , 15న గోవా , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి . జూన్ 20న గుజరాత్‌లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

సాధారణ పరిస్థితుల్లో జూన్ 10నాటికి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. అయితే సారి ఇవి మూడు రోజులు ముందుగానే కేరళలోకి ప్రశేశించాయి. దీంతో రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి కూడా జూన్ తోలివారంలోనే ప్రవేశించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రుతుపవానాల కదలికకూ అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రుతుపవనాల రాకతో కేరళతోపాటు , తమిళనాడు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల్లో కేరళలోని మిగితా ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటక , దక్షిణ , మధ్య బంగాళాఖాతంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని మరి కొన్ని ప్రాంతాల్లోకి రుతుపరాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్టు తెలిపారు.

తెలంగాణలో తేలిక పాటి వర్షాలు :

తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సోమ , మంగళవారాల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఆదివారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేసవి తీవ్రత మరింతగా ముదిరింది. నల్లగొండలో అత్యధికంగా 43.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 42.2, ఖమ్మంలో 42, అదిలాబాద్‌లో 41.8, భద్రాచలంలో 41.5, హన్మకొండలో 40.5, హైదరాబాద్‌లో 39.9, మహబూబ్ నగర్‌లో 39.2, మెదక్ లో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News