Wednesday, January 22, 2025

పెద్ద చెరువులో దూకి వ్యక్తి ప్రాణాలను కాపాడిన శ్రీకాంత్‌ను అభినందించిన ఎస్పీ

- Advertisement -
- Advertisement -

నారాయణపేట :
ఊట్కూర్ పెద్ద చెరువు వద్ద చాకలి బాలప్ప చేపలు పట్టేందుకు వెళ్లి వలను తీస్తుండగా వల చుట్టుకొని నీటిలో మునిగిపోయాడు. అది గమనించిన మగ్దుంపుర్ గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ వెంటనే నీటిలోకి దూకి ఆ వ్యక్తిని రక్షించాడు. స్పృహ కోల్పోయిన బాలప్పను సిపిఆర్ చేయడంతో బతికాడు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన శ్రీకాంత్ ధైర్యాన్ని మెచ్చుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు అతని అభినందించి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఊట్కూర్ ఎస్‌ఐ రమేష్, పెద్ద జెట్రం ఎంపీటీసీ కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News