Monday, December 23, 2024

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మున్సిపల్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

రామ టాకీస్ వద్ద గల మురికి కాలువపై చేపట్టిన పనులను ఆయన పరిశీలించి మాట్లాడుతూ మురికి కాలువకు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని సూచించారు. కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇందిరా పార్క్ వద్ద గల కరెంట్ పోల్స్‌ను పరిశీలించారు.

వెంటనే వాటిని మార్చి కొత్త పోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసిన పేర్లతో కూడిన బోర్లును తీసివేయాలని, తోపుడు బండ్లు, టీ స్టాల్స్ తీసేయాలని తెలిపారు. మున్సిపాలిటి అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, కలెక్టరేట్ ఏఓ విజేందర్ గౌడ్, అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News