Sunday, December 22, 2024

ఆధ్యాత్మిక కేంద్రంగా రుద్రారం గణేశ్ గడ్డ సిద్ది వినాయక ఆలయం

- Advertisement -
- Advertisement -
  • రూ. కోటి 40 లక్షలతో అన్నదాన సత్రాన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: మండల పరిధిలోని రుద్రారం గణేశ్ గడ్డ విగ్నేశ్వర ఆలయంలో రూ. కోటి 40 లక్షల అంచనా వ్యయంతో అన్నదాన సత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు శనివారం ఉదయం స్థానిక నాయకులతో కలసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన వినాయక ఆలయంలో భక్తుల అవసరాలను దృష్టిలలో పెట్టుకొని సకల సౌఖర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తుల వినాయకున్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల అవసరాల మేరకు ఇప్పటికే అంచలంచలుగా చాలా వరకు సౌకర్యాలను సమకూర్చామన్నారు.

ఆలయంలో శివ, అయ్యప్ప, ఆంజనేయ స్వామి భక్తుల కోసం ద్యాన మందిరాల నిర్మాణ పనుల కోసం స్థలం కేటాయించామన్నారు. ఆలయంలో రాజ గోపురం ఏర్పాటుకు సొంత నిధులు కోటి 50 లక్షలు అందజేశానన్నారు. నియోజకవర్గంలో పురాతన ఆలయాల పునరుద్ధరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపిటిసిలు రాజు, హరి ప్రసాద్ రెడ్డి, నాయకుడు శ్రీశైలం యాదవ్, గాయత్రం పాండు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News