Sunday, January 19, 2025

ధూప, దీప, నైవేధ్యం అలవెన్స్‌ పెంపు

- Advertisement -
- Advertisement -

ప్రతి నెల ఇచ్చే రూ.6వేల అలవెన్స్‌ రూ.10 వేలకు పెంపు

మనతెలంగాణ/హైదరాబాద్:  ధూప, దీప, నైవేధ్యం అలవెన్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్చకులకు ప్రతి నెల ఇచ్చే రూ.6వేల అలవెన్స్‌ను రూ.10 వేలకు పెంచాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. కెసిఆర్ ఆదేశాల మేరకు తాజాగా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ 10వేల రూపాయల్లో అర్చకుల గౌరవ వేతనం కింద రూ.6వేలు, ఆలయంలో పూజలు, ఇతర నిర్వహణకు రూ.4వేలు కేటాయించింది. ఆలయాల్లో నిరంతరం పూజలు, ఇతర కార్యక్రమాలు జరగాలన్న ఉద్దేశంతో కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ధూప,దీప,నైవేధ్య పథకాన్ని తీసుకొచ్చింది.

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ 2009లో ధూప, దీప నైవేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత అర్చకులకు నెలకు రూ. 2,500ల వేతనంగా నిర్ణయించింది. కానీ, ఈ వేతనాలు అర్చకులకు, ఆలయాల నిర్వహణకు ఏమాత్రం సరిపోవని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సిఎం కెసిఆర్ నేతృత్వంలో 2015 జూన్ 2 నుంచి ధూప,దీప, నైవేధ్యాల కింద అందజేస్తున్న వేతనాలు రూ. 6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అటు ఆలయాలకు ఇటు అర్చకులకు ఎంతో మేలు చేకూరింది. ప్రస్తుతం పెరిగిన ఖర్చులతో ఇది కూడా సరిపోదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి ధూప,దీప, నైవేధ్యం కింద ఇచ్చే అలవెన్స్‌ను రూ.10వేలకు పెంచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News