Monday, December 23, 2024

రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట

- Advertisement -
- Advertisement -

వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తుందని శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ అన్నారు. సోమవారం డా. సి. నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా, వారి స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మ జిపేట గ్రామంలోని నివాసంలో ఆయన స్మృతి వనానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో అవార్డు లు, ఉన్నత శిఖరాలు అధిరోహించిన గొప్ప మహానుభావుడు డా. సి. నారాయణ రెడ్డి అన్నారు. 1969 లో ఘంటసాల గారి సభ లో పా ల్గొన్నానని అప్పుడు వారు చెప్పిన కవిత్వం లలిత కళలకు వెన్నెలవాడ వేములవాడ అనే మాటా నాకు బాగా గుర్తుంధని అన్నారు.

దానికి అనుగుణంగా సంస్కృత, వేద, సంగీతం, నాట్య పాటశాలలు రానున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తుందన్నారు. పట్టణంలో ఉన్న సినారె భవనం శిథిలావస్థకు చేరడంతో, ఆ భవనాన్ని తీసేసి, రూ .10 కోట్లతో సినారె ఆడిటోరియం ను సర్వాంగ సుందరంగా ఆధునిక హంగులతో విశాలంగా కొత్తగా నిర్మించబోతున్నామని తెలిపారు. సినారే గారు తెలుగు ప్రాంతానికి ముద్దు బిడ్డ అని, తెలుగు ప్రజలందరికి వారంటే ఎనలేని గౌరవం అని వారి ప్రభావం ఈ ప్రాంతం, మా అందరి పైన ఉన్నదన్నారు.

వారి సేవలు, స్ఫూర్తి ముందు తరాలకు అందచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గంగ, కవి నలిమేల భాస్కర్, శా తవాహన విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ కంఠశాల మల్లేశం, సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జె. చెన్నయ్య , మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి , జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆవునూరి శంకరయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం , కౌన్సిలర్లు యాచమనేని శ్రీని వాసరావు , ఇప్పపూల అజయ్ , పట్టణ అధ్యకులు పుల్కం రాజు , మండల అధ్యక్షులు గోస్కుల రవి,సర్పంచ్ జింకే విజయ-శ్రీనివాస్ రెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News