Saturday, December 21, 2024

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

- Advertisement -
- Advertisement -

మణుగూరు : నిబద్ధత నిరంతరం శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం వారి భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. సోమవారం మణుగూరు మండలంలోని పివి కాలనీ భద్రాద్రి స్టేడియం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింగరేణి సంబరాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై తొలిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 9ఏళ్లలో సాధించిన అద్భుత ప్రగతి ఫొటో ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు.

బతుకమ్మ ఆటపాటలతో డ్యా న్సులు చేసి సందడి చేశారు. కారుణ్య నియామకాలలో భాగంగా పలువురికి నియమక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి నేడు దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. బొగ్గు గని మైనింగ్ పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్ధానంలో సింగరేణి సంస్ధలు నిలపడం కార్మికుల శ్రమ నైపుణ్యం గొప్పదన్నారు. సింగరేణి సంస్ధ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నదని, దక్షిణ భారతదేశంలో సింగరేణి సంస్ద దేశానికి తలమానికగా ఉన్నదన్నారు.

తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని సింగరేణి లాభాల బాటలు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రగతి పథంలో వెళుతున్నదని దానికి అనుగుణంగా ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News