Sunday, January 19, 2025

పాడి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి

- Advertisement -
- Advertisement -

హయత్‌నగర్: పాడి రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం హయత్‌నగర్ మదర్ డైయిరీ సంస్థ కార్యాలయంలో సుమారు రూ. 3కోట్ల నిధులతో నూతన బాయిలర్, కోల్డ్ స్టోరేజీ, పెరుగు ఫ్లాంట్ విస్తరణ, విజయ నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నూ తన బ్రాండ్ పాల ప్యాకెట్‌ను మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, సంస్థ ఛైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నార్ముల్ మదర్ డైయిరీ అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం ఉం టుందని వెల్లడించారు. వినియోగదారుకు నాణ్యమైన పాలను అందిస్తు వా రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పాలతోపాటు బై ప్రొడక్ట్ మార్కెటింగ్ పెంచుకొని సంస్థ ఆర్ధికాభివృద్ది సాధించాలని సూచించారు. సంస్థ మనుగడలో ఉద్యోగుల పాత్ర కీలకమని నిబద్ధ్దతో పని చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి. కృష్ణ, డైరెక్టర్‌లు అరుకాల గాల్‌రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, చింతలపురి వెంకట్రామిరెడ్డి, కర్నాటి జయశ్రీ, రచ్చ లక్ష్మి, కందాల అలివేలు, చ ల్లా సురేందర్‌రెడ్డి, నర్సింహ్మరెడ్డి, కోట్ల జలెందర్‌రెడ్డి, గూడూరు శ్రీధర్‌రెడ్డి, గొల్లపల్లి రాంరెడ్డి, మందాడి ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News