Friday, April 4, 2025

రాష్ట్ర ప్రభుత్వం  పిఆర్‌సి కమిటీని నియమించాలి

- Advertisement -
- Advertisement -

వడ్డేపల్లి : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రంలో ఆదివారం యుటిఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు బదిలీలతో కూడుకున్న ప్రమోషన్లను ఇవ్వాలని, పిఆర్‌సి కమిటీని వెంటనే నియమించాలని, డిఏ బకాయిలను, పెండింగ్‌లో ఉన్న మూడు డిఏలను తక్షణమే ప్రకటించాలని అన్నారు.

ఇలా అనేక సమస్యలపై సతమతమవుతున్న ఉపాధ్యాయులపై మానవతా దృక్ఫథాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్డేపల్లి మండల అధ్యక్షులు యాదయ్య, ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు తిలక్, కుమార్ నాయుడు, వడ్డేపల్లి మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News