- Advertisement -
మనతెలంగాణ/హనుమకొండటౌన్: హైదరాబాద్‌లోని ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో తనను కలవాలని వచ్చిన వికలాంగులను చూసి కిందికి వచ్చి వారితో పాటు మెట్ల మీద కూర్చోని వారికి నేనున్నానని చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ శనివారం ధైర్యాన్ని నింపారు. వారితో కాసేపు ముచ్చటించి వారి స్థితి గతులు తెలుసుకొని త్రిచక్ర మోటారు వాహనాలు కావాలని వారు అడగడంతో తక్షణమే స్పందించిన చీఫ్ విప్ మంత్రివర్యులు, కార్పొరేషన్ చైర్మన్‌తో మాట్లాడి అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా మోటారు వాహనాలను అందజేస్తామని హామీనిచ్చారు.
- Advertisement -