Sunday, January 12, 2025

శాంతి భద్రతలు కాపాడటంలో రాష్ట్రం ముందంజ

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: దేశంలోనే శాంతి బద్రతలు కాపాడంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని గురుకుల విధ్యాపీఠ్ గేట్ నుండి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా ఇబ్రహీంపట్నం పోలీస్ శాఖ ఆద్వర్యంలో తెలంగాణ రన్ కార్యాక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈసందర్భంగా నియోజకవర్గంంలోని ప్రజా ప్రతినిథులు , అధికారులు, బంటి యూత్ పోర్స్, బిఆర్‌ఎస్‌వి సబ్యులు పెద్ద ఎత్తున హాజరైనారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉం దని చెప్పారు. ప్రెండ్లీ పోలీస్‌గా ప్రజలతో మమేకమై ఉంటు ఏలాంటి ఘర్షణకు తావు ఇవ్వకుండా పోలీసులు వ్యవరించిన తీరు ఆమోగమన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకెఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణలో నిరుద్యోగ యువతకు 260 మందికి ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు.

ఈ కార్యాక్రమంలో తూర్పు డివిజన్ ఆర్డీఓ వెంకటాచారీ ,మార్కెట్ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, రైతు బందు జిల్లా కన్వీనర్ వంగేటి లకా్ష్మరెడ్డి , కొత్త కుర్మ సత్తయ్య, ఎంపిపి కృపేష్ , సిద్దంకి కిష్ణారెడ్డి, మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఆకుల యాదగిరి, డిసిపి శ్రీనివాస్ ,ఏసిపి ఉమామహేశ్వరరావు , సిఐలు రామక్రిష్ణ , నియోజకవర్గ యువజన విబాగం అధ్యక్షులు జెర్కోని రాజు , నిట్టు జగదీష్ , మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు , బంటి యూత్ పోర్స్ సబ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News