Wednesday, January 22, 2025

వరద ‘విలయం’

- Advertisement -
- Advertisement -

కూలిన వంతెనలు, ఛిద్రమైన రహదారులు ఇండ్లు కూలి నలుగురి
దుర్మరణం కాల్వలకు గండ్లు మత్తడి పోస్తున్న చెరువులు పంట
పొలాలకు భారీ నష్టం పలు గ్రామాలకు రాకపోకలు బంద్
వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం భయం గుప్పిట భద్రాద్రి

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్ : భారీ వర్షాలు రాష్ట్రా న్ని వదిలేలా కన్పించడం లేదు. పక్షం రోజుల క్రితం వర కూ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని గడగడలాడించిన వర్షాలు గడచిన రెండు రోజులుగా మళ్లీ విజృంభించి రాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లోని జనాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వర్ష ప్రభావం కన్పిస్తోంది. శుక్రవారం నుంచి మొదలైన వర్షాలకారణంగా ఇళ్లు కూలి నలుగురు మృత్యువాత పడగా.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. తాలిపేరు ఉగ్రరూపంతో భద్రాద్రికి మరోసారి వరద ముప్పు వాటిల్లే ప్రమాదం కన్పిస్తోంది.

ములుగు జిల్లా పాలేరు వాగు కారణంగా చిక్కుకుపోయిన 22 మంది కూలీలను శనివారం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. ఈ సందర్భంగా కూలీలను మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించి ఒక్కొక్కరికి రూ.5వేల ఆర్థిక సాయం, పది కిలోల బియ్యం పంపిణీ చేశారు. కాగా, వర్షాలు జనాల ప్రాణాలను మింగేస్తున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి శివారు లక్ష్మిగణేష్ మినరల్స్‌లో కూలి పనికి వచ్చిన బిహార్‌కు చెందిన రన్‌బెన్ యాదవ్(50), వికారి యాదవ్(45) మృత్యువాత పడ్డారు. భారీ వర్షానికి రేకులషెడ్ గోడ వీరు మరణించారు. కాగా, వరంగల్ నగరంలోని మండిబజార్‌లో శిథిలావస్థలో ఉన్న భవనం పడిపోయి పైడి(60)అనే వృద్ధుడు, ఫిరోజ్(20) అనే యువకుడు మృతిచెందారు.

భద్రాద్రి వద్ద పెరుగుతోన్న గోదావరి

భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుముఖం పట్టిన గోదావరి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం అర్థరాత్రి నాలుగు అడుగులకు పైగా పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి 41.9 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 10 గంటలకు 45.9 అడుగులకు చేరుకుంది. స్లూయిజ్‌ల వద్ద బ్యాక్ వాటర్ కారణంగా పట్టణంలోని కొత్తకాలనీ మళ్లీ ముంపునకు గురైంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మోయ తుమ్మెద వాగులోకి వరద నీరు వచ్చి చేరడంతో కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద వాగు ఉరకలేస్తుంది. సిద్దిపేటహన్మకొండ వెళ్లే ప్రధాన రహదరి మధ్య బస్వాపూర్ బ్రిడ్జి నీట మునిగింది. కాగా, చేగుంట, పోలంపల్లి, మక్కరాజిపేటలో చెరువులు నిండికుండల్లా మారిపోయాయి. వర్షానికి పలు కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. కాగా, వెల్దుర్తి మండల పరిధిలోని తొమ్మిది చెక్‌డ్యాంలు, మాసాయిపేట మండలంలోని ఒక చెక్ డ్యాం మత్తడులు దూకుతున్నాయి. ఎగువ నుండి వస్తున్న వరదతో హాల్దీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది.

తాడ్వాయి-పస్రా మధ్య తెగిన వంతెన అప్రోచ్ రోడ్

ఉమ్మడి వరంగల్ ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని జలగవంచ ఆగు వద్ద నిర్మించిన బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతి కారణఃగా బ్రిడ్జికి ఇరువైపులా కిలోమీటర్లు పొడవు సైడ్ వాల్స్‌తో పాటు, అనుసంధానంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. దీంతో రవాణా స్తంభించి ప్రయాణికులు నానా అవస్థలకు గురయ్యారు. ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రికి మరోసారి వరద ముప్పు తప్పేలా లేదు. ప్రస్తుతం జిల్లాలోని చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో దిగువ లోతట్టు దోసెలపల్లి మీదుగా ప్రాజెక్టు వరకు ఉన్న రహదారి మీదకు వరద నీరు పోటెత్తింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News