Monday, December 23, 2024

సమైక్యతా వజ్రోత్సవాలకు రాష్ట్రం ముస్తాబు

- Advertisement -
- Advertisement -

The state is ready for the Unity Diamond Festival

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారం భ వేడుకలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అ న్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించడంతో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఈ ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధం అవుతోంది. మం త్రులు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమాలను ఖరారు చేస్తున్నారు.

అప్పటి హైదరాబాద్ ప్రాంతం భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు ప్రారంభ వేడుకలను నిర్వహించనుంది. ఇందుకోసం సాధారణ పరిపాలనా శాఖ (జిఏడి) ఇప్పటికే ఉత్తర్వులు జారీ చే సింది. ఈనెల 17వ తేదీన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ సెంట్రల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు.

అనంతరం సిఎం ప్రసంగించనున్నా రు. ఇందుకోసం పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసు సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మంత్రులు, ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆయా జిల్లాల్లో పతాకావిష్కరణ చేసే మంత్రులు, ప్రముఖుల పేర్లను ఇప్పటికే జీఏడి ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. 16వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ర్యాలీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువత, మహిళా సంఘాలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. 18వ తేదీన జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

స్వాతంత్ర సమరయోధులు, కళాకారులను సన్మానిస్తారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సంబంధిత మంత్రులు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమైన ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు జాతీయ జెండాలతో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 17వ తేదీన హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజారాభవన్‌లను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నారు. గిరిజన, ఆదివాసీ, గోండు కళారూపాలతో నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News