Sunday, December 22, 2024

వెలుగు జిలుగుల రాష్ట్రం

- Advertisement -
- Advertisement -

అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా
విద్యుత్ కాంతులతో ప్రజ్వరిల్లుతోన్న తెలంగాణ

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అంధకారంగా మారుతుంది.. తద్వారా జాతీయ,అంతర్జాతీయ పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయనే నాటి పాలకుల శాపాలను పటాపంచలు చేస్తూ రాష్ట్రం సాధించిన అనతి కాలంలో తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం అన్ని రంగాలకు 24 గంటలపాటు విద్యుత్‌ను అందించే స్థాయికి ఎదిగింది.యావత్ తెలంగాణకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో ప్రభుత్వం అనేక ప్రణాళికలను రూపొందించడంతో పాటు వాటిని సక్రమంగా అమలు చేస్తూ ముందుకెళుతోంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వచ్చినా కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కరెంట్ కోతలు లేకుండా రాష్ట్రం వెలుగు జిలుగుల మధ్య ప్రకాశిస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి విద్యుత్‌రంగం పురోగతి( మెగావాట్లలో)
థర్మల్ విద్యుత్ 2014లో 4426 మెగవాట్లు ఉండగా 2023 నాటికి అది 9582 మెగావాట్లకు చేరుకుంది. అదే విధంగా జల విద్యుత్ 2014లో 2158 మెగావాట్లు ఉండగా 2023 నాటికి 2518 మెగావాట్లు, సౌర విద్యుత్ 2014లో 74 మెగావాట్లు ఉండగా 2023 నాటికి 5347, మొత్తం 2014 లో 7778 మెగావాట్లు ఉండగా అది 2023 నాటికి 15497 మెగావాట్లకు చేరుకుంది.
ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లు
తెలంగాణ ఏర్పడేనాటికి (2014) 400 కేవీ సబ్‌స్టేషన్లు ఉండగా నేడు 30 వరకు ఉన్నాయి. అదే విధంగా 220 కేవీ సబ్‌స్టేషన్లు 51 ఉండగా నేడు 103 వరకు ఏర్పాటు అయ్యాయి. 132 కేవీ సబ్‌స్టేషన్లు 176 ఉండగా ప్రస్తుతం అవి 251కి చేరుకున్నాయి.అదే విధంగా 2014 హెచ్‌టి లైన్లు 2014లో 16379 కిలో మీటర్లు ఉండగా అవి ప్రస్తుతం 28131 కిలో మీటర్లకు చేరుకున్నాయి. డిస్కంల ఆధ్వర్యంలో 2014లో 33 కేవీ సామర్థం గల సబ్‌స్టేషన్లు 2138 ఉండగా ప్రస్తుతం 3210 వరకు చేరుకున్నాయి. పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 3272 ఉండగా అవి నేడు 5691 వరకకు ఉన్నాయి.డిటీఆర్ ( డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు )4,61937 ఉండగా నేడ అవి 8,60,239 వరకు ఉన్నాయి. అదే విధంగా వ్యసాయ వినియోగదారులు 19,0300 వేలు ఉండగా నేడు 27 లక్షల 2494 మంది ఉన్నారు.
సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల్లో సుమారు రూ.91 వేల కోట్ల నిధులను ఖర్చు చేసింది దీని ద్వారా 8 లక్షల 10 వేల నూతన వ్యసాయ కనెక్షన్లు అందించింది.రాష్ట్రం ఏర్పడేనాటికి వ్యవసాయానికి పగలు 3 గంటలు, రాత్రి 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. ఇప్పుడు వ్యవసాయరంగా నికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలో ప్రస్తుతం 25.63 లక్షల వ్యవసాయ వినియోగదారులకు ప్రభుత్వం 24 గంటల నిరంతరాయ పూర్తి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.
ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు…
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రతినెలా 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందజేస్తోంది. దీని ద్వారా 5,00,771 మంది ఎస్సీలు, 2,69,983 మంది ఎస్టీలు లబ్ధి పొందుతున్నారు. నాయి బ్రాహ్మణులు / హెయిర్ కటింగ్ సెలూన్లు, రజకులు దోబీఘాట్లు/ లాండ్రీ షాపులకు ప్రతినెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున 4,920 పవర్‌లూమ్స్, 5894 పౌల్ట్రీ ఫాంలకు సరఫరా చేసే విద్యుత్‌పై సబ్సిడీని అందజేస్తోంది.
23.15 లక్షల వినియోగదారులకు లబ్ధి
పల్లె ప్రగతిలో నెట్‌వర్క్ పంపిణీని పరిచేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.333 కోట్లను ఖర్చు చేసింది. దీని ద్వారా 41.98 లక్షల మంది విని యోగదారులకు లబ్ధి చేకూరుతుంది. పట్టణ ప్రగతిలో పంపిణీని సరి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.134 కోట్లను వెచ్చించింది. దీంతో 23.15 లక్షల వినియోగదారులకు లబ్ధి చేకూరింది.
ఆర్టిజన్ల క్రమబద్ధీకరణ
కాంట్రాక్టర్ల వద్ద తక్కువ వేతనంతో పనిచేస్తున్న 23,667 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను (ఆర్టిజన్లను) క్రమబద్ధీకరించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News