Wednesday, January 22, 2025

అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం

- Advertisement -
- Advertisement -

వరంగల్: అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల నేపథ్యంలో గురువారం అమరవీరుల సంస్కరణ దినోత్సవం ను పురస్కరించుకొని మహానగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించింది .అనంతరం ప్రవేశపెట్టిన అమరుల సంస్మరణ తీర్మానాన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ నెల 22 వరకు నిర్వహించడం జరుగుతుందని ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మహానగర పాలక సంస్థ అమరవీరుల సంస్మరణ దినం గా కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం అమరుడైన వారికి నివాళులు అర్పిస్తూ తీర్మానాన్ని చేయడం జరిగిందని, ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు అందరికీ ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కృషి వల్ల ఎన్నో దశాబ్దాల నుండి కలగానే మిగిలిన రాష్ట్ర ఆకాంక్ష సఫలీకృతం కావడం జరిగిందని, సిద్ధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి కి మేయర్ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నేడు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు,కార్పొరేషన్ లలో కూడా తీర్మానాలు చేయాలని ఆదే శించి అమరుల త్యాగాలకు గుర్తింపును ఇచ్చారని, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే లా పాఠశాలల్లో విద్యార్థులకు అమరుల త్యా గ ఫలాలు తెలిసేలా 2నిం.లు మౌనం పాటించేలా ఆదేశించారని,అమర వీరుల చరిత్రను భావి తరాలు గుర్తుంచుకునే విధం గా కార్యక్రమాలు రూపొందించారని, దేశ వ్యాప్తంగా గుర్తుండేలా హైదరాబాద్ లో అమరులను స్మరిస్తూ అమర జ్యోతి స్మారకాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందని, గత తొమ్మిదిన్నర సం.లుగా నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ కృషి చేస్తున్నారని, నగర అభివృద్ధి కి ఇప్పటికీ సుమారు 1250 కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించడం జరిగిందని, నగరాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి వైకుంఠధామాలు, జంక్షన్ల, రోడ్ల,బండ్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న రింగురోడ్డు పనులకు ఇటీవలే కేటీఆర్ శంకుస్థాపన చేశారని, దశాబ్ది ఉత్సవ వేడుకల నిర్వహణకు 20 రోజుల ప్రణాళిక ను రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్యులు దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఇతర ప్రజా ప్రతినిదులు,కార్పొరేటర్లకు ఈ సందర్భంగా మేయర్ ధన్యవాదాలు తెలిపారు. శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉద్యమ నాయకులలో కెసిఆర్ కు అగ్రస్థానం దక్కుతుందని, అమరుల కుటుంబాలకు గుర్తింపు ఇచ్చే విధం గా ప్రభుత్వం పరంగా వారిని సత్కరించడం, అమరవీరు లను ప్రతి సంవత్సరం స్మరించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వ్యవస్థలో పనిచేసిన అన్ని వర్గాల వారిని నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉందని, గ్రామస్థాయి నుండి కార్పొరేషన్ స్థాయి వరకు ప్రతి ఒక్కరిని దశాబ్ది ఉత్సవ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన ముఖ్యమంత్రి ధన్యులు అని కొనియాడారు. ఈ సందర్భంగా అమరులు చేసిన త్యాగ ఫలాలను పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ వేదికగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, ఉప మేయర్ రిజ్వాన షమీం మసూద్ తోపాటు పలు డివిజన్ లకు చెందిన కార్పొరేటర్లు,బల్దియా కు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News