Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తుంది

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రం సిఎం కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ది,ఆధునికతలో పురోగమిస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యాదినోత్సవ వేడుకల సందర్బంగా నేరేడుచర్ల మండల పరిధిదిలోని కల్లూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో మనఊరు-మనబడి కార్యక్రమంతో రూ.15లక్షలు,ఎన్‌ఆర్‌ఈజీఎస్ రూ.7.50లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంబించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమే పల్లెలు సర్వతోముఖ అభివృద్ధిని సాధిస్తూ కలకలలాడుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు అనుభవజ్ఞులైన ఉపాద్యాయులచే నాణ్యమైన విధ్య, భోజనం,హాస్టల్ వసతి, పాఠ్యపుస్తకాలు, డిజిటల్ తరగతులు, పౌష్టికాహారం అందిస్తుందన్నారు.ఒక వైపు పచ్చదనం, ప్రభుత్వ పథకాలు, సంక్షేమాన్ని ఇంటింటికీ అందిస్తున్న ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు విద్యార్ధులకు ప్రభుత్వం అందించే నోట్ పుస్తకాలను అందజేశారు. అనంతరం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.15లక్షలతో సిసిరోడ్డు పనులకు శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లకుమళ్ళ జ్యోతిబిక్షం,కల్లూరు సర్పంచ్ పల్లెపంగు నాగరాజు, సోమారంఎంపీటీసీ నందిపాటి నాగవేణి గురవయ్య, మండలపార్టీ అద్యక్షుడు అరిబండి సురేష్‌బాబు, చిల్లేపల్లి పీఏసియస్ చైర్మన్ అనంతు శ్రీనివాస్‌గౌడ్,పార్టీ నాయకులు, కార్యకర్తలు,స్ధానిక ప్రజలు, విద్యార్ధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News