Wednesday, January 22, 2025

చత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనకు రోల్ మోడల్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఈసారి విజయావకాశాలు మెండు
కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసాన్ని పెంచుకున్నారు
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

మనతెలంగాణ/హైదరాబాద్:  ఐదేళ్లుగా అధికారంలో ఉన్న చత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనకు రోల్ మోడల్ అని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.తెలంగాణలోనూ ఈసారి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని, కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసాన్ని పెంచుకున్నారని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ నేతలంతా భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేశారని, అదే సూత్రాన్ని తెలంగాణలోనూ కూడా కొనసాగించాలని రాష్ట్ర నేతలకు సీడబ్లూసీ సమావేశాల్లో భాగంగా మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల పరిస్థితిని ఆయన రాష్ట్ర నేతలకు వివరించారు.

5 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌దే విజయం
తెలంగాణ సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలవబోతుందని, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం నెలకొనడమే ఇందుకు కారణమన్నారు. తెలంగాణలో వరుసగా రెండు టర్మ్‌ల నుంచి కొనసాగుతున్న బిఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, అసంతృప్తి ఉందని, ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను నమ్ముతున్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని వివిధ స్థాయిల్లోని నేతలు వ్యక్తిగత భిన్నాభిప్రాయాలను, అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి కర్ణాటకలో ఐక్యంగా పనిచేశారని, చివరకు విజయాన్ని సాధించారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో సైతం అదే ఫార్ములాను అనుసరించాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News