Monday, December 23, 2024

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ

- Advertisement -
- Advertisement -

హత్నూర: హత్నూర మండలం కాసాల గ్రామ శివారులో గల 12వ వార్డులో ఆదివారం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాలనీలో ఉన్న మాజీ సర్పంచ్ పూసల వెంకటమ్మ సత్యనారాయణ గౌడ్ ఇంటి నుండి నూతనంగా ఏర్పాటు చేసిన పోచమ్మ తల్లికి ఒగ్గు డప్పు కళాకారులతో గౌడ ఘట్టమును విగ్రహ ప్రతిష్టాపన వరకు ఊరేగింపుగా సమర్పించారు. కాలనీలో ఉన్న మహిళలు గ్రామస్తులు బోనాలతో అమ్మవారికి మంగళ హారతులు నైవేద్యాలతో ప్రత్యేక హోమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి నర్సింలు, సర్పంచ్ రాణి రామచంద్రారెడ్డి, ఎంపిటిసి బైసాని విజయలక్ష్మి వెంకటేశం గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, బక్క రవి,ప్రభాకర్, డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, స్వామి గౌడ్, రాజా గౌడ్, వీరేశం గౌడ్, నాగభూషణం,ఆశిరెడ్డి, నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, సుధీర్ రెడ్డి, కొండగౌడ్, బిక్షపతి, మల్లేష్, పాపయ్య, గోపాల్, పెంటయ్య, సందీప్ రెడ్డి ఆంజనేయులు పార్థివా రెడ్డి, కెఎన్‌ఆర్ కాలనీవాసులు, మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News