Wednesday, January 22, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై:  స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 676.69 పాయింట్లు లేక 0.92 శాతం పెరిగి 73663.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203.30 పాయింట్లు లేక 0.92 శాతం పెరిగి 22403.85 వద్ద ముగిసింది.

నేడు లాభపడ్డ షేర్లలో ఎం అండ్ ఎం, టాటా కన్జూమర్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ టి ఐ మైండ్ ట్రీ ఉండగా, ప్రధానంగా నష్టపడ్డ షేర్లలో మారుతి సుజుకీ, టాటా మోటార్స్, ఎస్ బిఐ, బిపిసిఎల్  ఉన్నాయి. అమెరికా డాలర్ల తో పోల్చినప్పుడు రూపాయి మారకం విలువ ఏ మాత్రం మారక డాలరుకు రూ. 83.50 వద్ద ట్రేడయింది. బంగారం ధర రూ.159 తగ్గి రూ. 72943.00 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News