Wednesday, January 22, 2025

అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్ ఢమాల్!

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో  నేడు అమ్మకాల ఒత్తిడి కారణంగా ఢమాల్ అయ్యింది. నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ ఎక్కడా కోలుకోలేదు. చివరి వరకు నష్టాల బాటనే పట్టింది. అమెరికా ద్రవ్యోల్బణం కారణంగానే నష్టాల్లో సూచీలు ముగిశాయని తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్ల సంకేతాలు కూడా ప్రతికూలంగానే కొనసాగాయి. మదుపరులు హై ప్రైస్ వద్ద ప్రాఫిట్ బుకింగ్ లకు పాల్పడ్డంతో సూచీలు పతనమయ్యాయి. పెరిగిన చమురు ధరలు కూడా కలవరపెట్టాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 793.25 పాయింట్లు పతనమై 74244.90 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 50 కూడా 234.40 పాయింట్లు పతనమై 22519.40 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో  లాభపడిన షేర్లలో డివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, టిసిఎస్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఉండగా, ఇక నష్టపోయిన షేర్లలో సన్ ఫార్మా, మారుతి సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కంపెనీ, ఓఎన్ జిసి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News