కాసిపేట: తొలకరి జల్లులతో పులకిరించి పంటలు వేసిన రైతులు వర్షం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూన్నారు. జూన్ చివరి వారంలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు రైతులు పొలంలో హాలం దున్ని పంటలు వేసారు. మండలంలో సూమారు 80 శాతం మంది రైతులు వాణిజ్య పంట అయిన పత్తి పంటలు వేసారు. పత్తి విత్తనాలు మెలకెత్తె దశలో వర్షాలు కురవక పోవడంతో రైతులు దిగాలు చెందుచున్నారు. మూడు రోజులు ముసుర్లతో వర్షం కురవగా రైతులు ఆనందంతో వ్యవసాయనికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వర్షాభావ పరి స్థితులు నెలకొనడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. రైతులు వేసవిలోనే దు క్కులు దున్ని, పంటలకు పొలాలను సిద్దం చేసుకున్నారు. కొన్ని రోజులుగా మేఘాలు దోబూచులాడుతున్నాయి.
ఆకాశంలో మేఘాలు వర్షించినట్లు అనిపించిన మేఘాలు కొద్ది సేపటికే కనుమరుగు అవుతుండడంతో రైతులు దిగాలు చెందుచున్నారు. ఇలాగే కొన్ని రోజులు వర్షాలు పడకపోతే పంటల ఎదుగుదల కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొట్ట ప్రాంతాలలో పత్తి పంటలు వేసిన రైతులు సాగు నీటి కోసం అలమటిస్తున్నారు. మండలంలో చెరువులు, ప్రాజెక్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికి ఇక్కడి రైతులు మాత్రం వర్షం నీటిపైనే ఆదార పడిఉన్నారు.
చెరువుల, ప్రాజెక్టుల కాలువల పరిస్థితి అధ్వాన్నంగ ఉండడం వల్ల రైతులకు నీరు అందని ద్రాక్షలా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులగా వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు దిగాలు చెందుచున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందా పంటల ఎదుగుదలకు ఎరువులు వేయాలనే ఆలోచనలతో రైతులు ఉన్నారు.
వ ర్షాభావంతో ఇంకా కొందరు రైతులు ఎరువులు కొనని పరిస్థితిలో ఉన్నారు. వర్షాలు సంవృద్దిగా లేకుంటే పంటలు ఊపండడం కష్టమేనని, పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోవడం జరుగుతుందని రైతులు అంటున్నారు. అన్నదాతలు నిత్యం ఆకాశంలో మేఘాలు దోబూచులాడుతున్నాయని, వర్షాలు కురవాలని రైతులు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు.