Friday, November 22, 2024

ఇదీ సీతాకోక చిలుకల పరిణామ చరిత్ర..

- Advertisement -
- Advertisement -

జీవవైవిధ్యం ఎలా ఆవిర్భవించింది? ఏ విధంగా అన్ని జీవసంబంధ జీవితాలకు ఆధారంగా అభివృద్ధి చెందింది? ఈ ప్రశ్నల పరంపరపై పరిశోధనలు సాగిస్తే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈమేరకు సీతాకోక చిలుకలను అధ్యయనం చేయడం అద్భుతమైన ప్రక్రియగా నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్‌సిబిఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ కృష్ణమేఘ్ కుంటే వెల్లడించారు. ప్రపంచం మొత్తం మీద 18000 రకాల సీతాకోక చిలుకలు మనకు తెలిసినవి ఉన్నాయి. వీటిలో 1400 రకాల సీతాకోక చిలుకల తెగలు మన భారత్‌లో ఉన్నాయి.

దీన్ని బట్టి ఈ జాతులు ఏ విధంగా ఏర్పడ్డాయి? ఏ విధంగా స్వరూప పరిణామం సంభవించింది? జంతువులు, వృక్షాలు, వేర్వేరుగా ఎలా పెరిగి అభివృద్ధి చెందాయి? ఇవన్నీ అవగతమవుతాయి. భూమిపై పర్యావరణ వ్యవస్థలు ఎలా మనుగడ సాగిస్తాయో అన్న నాటకంలో జీవవైవిధ్యం కీలక పాత్ర వహిస్తుంది. మూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒకేఒక సాధారణ పూర్వీకుని నుంచి జీవితం ఆవిర్భవించిందని పరమాణువు సాక్షంగా మనందరికీ తెలుసు. ఆఖరి వంద కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి పరిణామం క్రమంగా పెరుగుతూ వచ్చింది. భూమిపై జీవవైవిధ్యం అనేక రూపాల్లో బహుళ భాగాల సమ్మేళనంతో విస్తరించింది. బహుకణాలు ఏకీకృతమై జీవి ఆవిర్భవించింది.

ఈ నేపథ్యానికి భిన్నంగా మనం అన్ని కీటకాలు పరస్పర అనుబంధాన్ని పంచుకోవడం మనం గమనిస్తున్నాం. వాటికి నిర్దిష్టమైన శరీరాకృతి ఉంటోంది. కణజాల విధులు ఉంటాయి. జన్యుపరమైన లక్షణాలు కలిగి ఉంటాయి. జన్యుసరళిలో ఈ లక్షణాలు ఏ విధంగా ఏర్పడ్డాయి. సీతాకోక చిలుకలు కూడా అనేక పరిణామాత్మక లక్షణాలను కీటకాలతో పంచుకుంటాయి. సీతాకోక చిలుకలు కూడా ప్రత్యేక చిమ్మెట కీటకాలే. 150 మిలియన్ నుంచి 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి సోదరి సమూహాల నుంచి వేరయ్యాయి.

డైనోసార్లు అంతరించే సమయంలో సీతాకోక చిలుకలు ప్రత్యేకతను సాధించుకోవడానికి ముందే చిమ్మెట కీటకాలు 85 మిలియన్ సంవత్సరాల క్రితం తమకు తామే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చిమ్మెట కీటకాలతో పోల్చుకుంటే ఇవి ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తాయి. వాటిరంగులు వేట బారి నుంచి తప్పించుకోడానికి, లేదా తమ జతకట్టే కీటకాలను ఆకర్షించుకోడానికి ఉపయోగపడతాయి. ఇవి శీతల రక్త జీవులైనప్పటికీ గాఢమైన నలుపు రంగులు శరీర ఉష్ణోగ్రతలను సరిగ్గా నిర్వహించుకోడానికి వీలవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News