Monday, December 23, 2024

పట్టువదలని విక్రమార్కుడిలా జిపి కార్మికుల సమ్మె

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : జోరు వానను సైతం లెక్కచేయకుండా, పట్టువదలని విక్రమార్కుడిలా గ్రామపంచాయతీ పారిశుద్ద కార్మికులు సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా గురువారం ఎనిమిదవ రోజు సమ్మెలో పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు పందేటి చెన్నారావు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా కార్మికులమైన మేము సమ్మె చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్ర పంచాయతీ కార్మికులు కానట్టుగా వ్యవహరిస్తుందని, తాడోపేడో తేల్చుకునే వరకు జోరు వాన రాని, పిడుగులు పడినా, భూకంపం వచ్చి ప్రాణాలు పోయినా తాడోపేడో తేల్చుకుంటామని ప్రభుత్వం కనుక ఇంకా కాలయాపన చేస్తే సమ్మెను ఉదృతం చేస్తామన్నారు.

ప్రజల సహకారం కూడా తీసుకుని ఇంటింటికి వెళ్ళి మా సమస్యలు ప్రజలకు వివరించి ఈ ప్రభుత్వం దిగి వచ్చి పంచాయతీ కార్మికుల సమస్యను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొర్రెపాటి బసవయ్య, పెరుమాళ్ళ రాంబాబు, అన్నవరం జేమ్స్, సింగు జయలక్ష్మి, యశోద, నరసమ్మ, జ్యోతి, వెంకటమ్మ, రామకృష్ణ, నాగు, పంచాయితీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News