Wednesday, January 22, 2025

చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధనలో పెద్ద ముందడుగు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: అంతరిక్ష పరిశోధనలో చంద్రయాన్-3 విజయం పెద్ద ముందడుగు అని, ఇస్రో శా స్త్రవేత్తలు యావత్ దేశం గర్వించేలా చేశారని అఖిల భారత ప్రగతిశీల వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వి.ఎస్.బోస్ అన్నారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా ల్యాం డింగ్ అయిన సందర్బంగా అఖిల భారత ప్రగతిశీల వేదిక తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో గురువారం హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద సంబరాలు నిర్వహించారు. జాతీయ పతకాలు చేతబూని శాస్త్రీయ వి జ్ఞానం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ విద్యార్థినీవిద్యార్థులను మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్బంగా వి.ఎస్.బోస్ మాట్లాడుతూ చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 వంటి మిషన్‌లను కలిగి ఉన్న అంతరిక్ష శాస్త్రం కోసం ఖ ర్చు 32శాతం 2023.-24 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభు త్వం తగ్గించిందని, అయిన మన శాస్త్రవేత్తలు నిరాశ చెందకుండా ధైర్యంగా తమ మిషన్ ను విజయవంతంగా ఫూర్తి చేశారన్నారు. చంద్రయాన్-3 కోసం పనిచేసిన వేలాది మం ది ఇంజనీర్లకు కేంద్ర ప్రభుత్వం గత 17 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు.

నూతన సాంకేతిక ఆవిష్కరణలతో భారతను అంతరిక్ష శక్తిగా ఎదిగేందు కు కృషి చేస్తున్న మన శాస్త్రవేత్తలపై మోడీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభు త్వం వెంటనే అంతరిక్ష పరిశోధనల కోసం బడ్జెట్ ను పెంచి, శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చి, పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని అయన డిమాండ్ చేశారు. చంద్రయాన్-త్రీ విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు వి.ఎస్.బోస్ అభినందనలు తెలిపారు. అఖిల భారత ప్రగతిశీల వేదిక రాష్ట్ర సమన్వయకర్త స్టాలిన్ మాట్లాడుతూ చంద్రయాన్-3 మిషన్ విజయం భారతదేశ యువతకు శాస్త్రీయ విజ్ఞానం అభ్యసించేలా స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలను, ఇంజినీర్లను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వేదిక రాష్ట్ర నేతలు పి. ప్రేమ్ పావని, కె. ధర్మేంద్ర, సత్యప్రసాద్, నిర్లేకంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News