Monday, December 23, 2024

ప్రజల భాగస్వామ్యంతోనే ‘గ్రీన్ ఛాలెంజ్‌” సక్సెస్

- Advertisement -
- Advertisement -
అవుట్‌లుక్‌ మ్యాగజైన్ ఇంటర్వూలో ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజల భాగస్వామ్యంతోనే ఎలాంటి కార్యక్రమమమైనా సక్సెస్ కాగలదని, ఐదు సంవత్సరాలు పూర్తయినా ఇంకా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుండి నడిపించడంలో ప్రజల భాగస్వామ్యమే ఇందుకు నిదర్శనమని రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఓ ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపి సంతోష్‌కుమార్‌ను ‘అవుట్ లుక్‌మ్యాగజైన్’ పలకరించింది. అప్రతిహతంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రస్థానం నుంచి మహోద్యమం వరకు సాగిన తీరుపై ఎంపి సంతోష్‌ను ఇంటర్వూ చేసింది.

ఈ సందర్భంగా ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం లేనిదే అది విజయవంతం కాబోదు. సామాజిక స్పృహను ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు ఆలంబనగా నాడు ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం 5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని ఎంపి సంతోష్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ విస్తరణలో భాగంగా గ్రీన్ కవర్‌ను మరింత వృద్ధి చెందేలా అర్బన్ ఫారెస్ట్‌ల దత్తత కార్యక్రమాన్ని ఇనిషియేటివ్‌గా తీసుకున్న దరిమిలా పలువురు గ్రీన్ కవర్ పెంపు దలలో భాగంగా అర్బన్ ఫారెస్ట్‌లను దత్తత తీసుకుని పచ్చదనం పెంపుకు కృషి చేస్తున్నారని సంతోష్ వివరించారు. ఉష్ణతాపం ఎక్కువ కావడం, వర్షపాతం తక్కువగా నమోదవ్వడం తదితర కారణాలతో అర్బన్ ఏరియాలు కాంక్రీట్ జంగిల్‌గా మారాయన్నారు. ఈ పరిస్థితుల్లో తాము పూర్తిస్థాయిలో అర్బన్ ఏరియాలలో గ్రీన్ కవర్ పెంపుదల దిశగా కృషి చేస్తుని ఎంపి సంతోష్ అన్నారు.

ప్రస్తుత తరానికి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చదనం పెంపు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాధ్యతలుగా పేర్కొన్నారు. ఒక్క అర్బన్ ఏరియాలే కాదు.. రైతులతో పాటు గ్రామీణ ప్రజలు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆవశ్యకతను గుర్తించి భాగస్వాముల వుతున్నా రన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతోందని, ‘కోటి వృక్షార్చన, ముక్కోటి వృక్షార్చన’ ఇతరత్రా కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ప్రస్ఫుటమైందని ఎంపి సంతోష్ అన్నారు. దసరా పర్వదినాన అన్ని దేవాలయాలు, గ్రామాల్లో జమ్మి చెట్లు నాటి తద్వారా గ్రీనరీ శాతం పెంపుదలకు తోడ్పడాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపునిచ్చిన దరిమిలా ఆ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో సక్సెస్ అయ్యిందన్నారు.

సిఎం కెసిఆర్ హరితహారం స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో గ్రీనరీ శాతం పెంపుదలే లక్షంగా నాడు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గడిచిన ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో 7.7 శాతం గ్రీనరీ పెంపుదలకు దోహదపడిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక్క తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వ్యాపించిందని తెలిపారు. దాదాపు 16 కోట్ల మొక్కలను పది రాష్ట్రాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో నాటగలిగామన్నారు. స్వచ్ఛగాలి, పర్యావరణ పరిరక్షణే దిశగా కృషి చేయాలని ప్రజల్లో అవగాహన కల్పించడంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందంజలో ఉందన్నారు. ఇదే విధానం ఇకపైనా కొనసాగుతుందని ఎంపి సంతోష్ పేర్కొన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రస్థానం…
సిఎం కెసిఆర్ హరితహారం స్ఫూర్తితో 2018లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అప్రతి హతంగా కొనసాగుతోంది. తొలుత కొద్ది మంది సన్నిహితులతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగినప్పటికీ,అనంతర కాలంలో పలువురు సెల బ్రిటీలతో సహా ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దూసుకుపోతోంది. పచ్చదనం పెంపు ఆవశ్యకతను గ్రీన్ ఛాలెంజ్ ప్రజల్లో బలంగా నాటిందనడంలో అతిశయోక్తి లేదు. సరిహద్దులు దాటి ఖండాంతరాలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎగబాకింది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ మహాయజ్ఞం నేటికి నిరంతరాయంగా సాగుతోంది. ప్రతి ష్టాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో ఎంపి సంతోష్‌కు చోటు లభించింది. పచ్చదనం పెంపు, స్వచ్ఛమైన గాలి భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదు సంవత్సరాల క్రితం ఆరంభ మైంది. తెలంగాణను గ్రీన్ కవర్ జాబితాలో చూడాలనే ఉద్దేశంతో ప్రారం భమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంచెలంచెలుగా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు విస్తరించింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహో ద్యమంలో ప్రజల భాగ్యస్వామ్యం అంతకంతకు పెరుగుతూనే ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News