Monday, December 23, 2024

ఉపాధ్యాయ వృత్తి అత్యంత ఉన్నతమైంది

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ప్రపంచంలో అత్యంత ఉన్నతమైంద ఉపాధ్యాయ వృత్తేనని ఉపాధ్యాయ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఏవీన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమాన్ని స్థానిక వైశ్య భవనంలో ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ పూర్తిస్థాయి మౌళిక వసతులు లేకున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న గురువులను సన్మానించుకోవడం శుభపరిణామమన్నారు. ప్రభుత్వ పాఠశాల మౌళిక వసతులు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి శాసనమండలి లోపల, బయట కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

8 ఏళ్లుగా ఉపాధ్యాయ పదోన్నతులు, 5 ఏళ్లుగా బదిలీలు లేవని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి, నైతిక విలువలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

అన్ని వృత్తుల్లో పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి అని మనం ఈ వృత్తికి వన్నె తెచ్చే విధంగా నడుచుకోవాలని ప్రధాన వక్త జిన్నా సత్యనారాయణరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్,రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్, జిల్లా అధ్యక్షడు ముస్కుల సునీల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుగ్యాల శ్రీనివాసరావు, రాష్ట్రబాధ్యులు గిరిధర్ రెడ్డి, కనకయ్య, శ్రీనివాస్, మండల విద్యాధికారులు సురేందర్, రాజయ్య, సంపత్‌రావు, చాయ దేవి, కవిత, జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News