Thursday, January 23, 2025

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేయాలని తెలంగాణ సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు .శనివారం రాత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ యాత్ర సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సూర్యాపేట మండలం వెదిరేవారిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు చేపట్టామని చెబుతున్న ప్రభుత్వం అయినా నూతనంగా తీసుకొచ్చిందని ప్రశ్నించారు.

కృష్ణ ,గోదావరి నదుల నుండి ఒక ఎకరాకు కూడా అధర్మ నేర్చిన పరిస్థితులు లేవని విమర్శించారు. నీళ్ల గురించి అసత్యాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న విషయాన్ని పదే పదే చెబుతూ బారాస నాయకులు తమ పబ్బం కడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాలువలు నిర్మించిన ప్రాజెక్టు ద్వారానే కేసీఆర్ నీళ్ల సంబరాలు చేసుకుంటున్నారని కాలేశ్వరం నీళ్లు ఒక్క ఎకరాకు కూడా ఒక చుక్క నీళ్లు అందిన పరిస్థితి లేదని పునరుద్ఘాటించారు. పదియేడ్ల నుండి రాష్ట్ర సంపద దోపిడికి గురవుతుందని ఈ పరిస్థితి నుంచి విముక్తి పొందేందుకు ప్రజలు ఐక్యంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

భారత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై బహిరంగంగా చర్చించడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని సవాల్ విసిరారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ,ఎస్ ఎల్ బి సి ,డిండి ప్రాజెక్టులను ఇంకా పూర్తి చేయని పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్న అసత్య ప్రచారం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .సూర్యపేటకు ఎగువన ఉన్న మూసి ప్రాజెక్టులో కూడా పూర్తి చేసే పరిస్థితి లేకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీసిన కాలువలకు మరవతులు చేసే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేతపల్లి మండలం భీమారం గ్రామం మీదుగా సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్రకు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ,సూర్యపేట మాజీ శాసనసభ్యులు వెంకయ్య ,కాంగ్రెస్ నాయకులు పలువురు పెద్ద ఎత్తున గజమాలను వేసి స్వాగతం పలికారు . భట్టి స్వాగతం పలుకుతూ మహిళలు బోనాలతో ,కోలాటం,నృత్యాల మధ్య స్వాగతం పలికారు.

దారి పొడవునా ప్రజలు ఎవరి ఆటపాటలు వారివే పీపుల్స్ మార్చేయాత్రలో పేట కాంగ్రెస్ వర్గాల తీరు: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చి పాదయాత్ర పురస్కరించుకొని సూర్యాపేట జిల్లాలోకి అడిగిన క్రమంలో వెదిరే వారి గూడెం నుంచి సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని సైనికపురి కాలనీ వరకు ప్రజలు ర్యాలీగా తరలివచ్చారు .ఈ క్రమంలో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ,పిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వర్గాలకు చెందిన కార్యకర్తలు నాయకులు వేరువేరుగా పలుచోట్ల ర్యాలీలో భాగస్వాములై తన వర్గ పోరును మరోసారి బహిర్గతం చేసుకున్నారు.

ఆదివారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలోని సైనికపురి కాలనీ నుంచి బట్టి పాదయాత్ర ప్రారంభమై ఖమ్మం క్రాస్ రోడ్ గుండా చివ్వేంల మండలంలోకి సాగనుంది. కాంగ్రెస్లోని రెండు వర్గాలు దర్శన పడతాయేమోనన్న ఆందోళన ప్రజలలో వ్యక్తం అవుతుంది. సూర్యాపేట రూరల్ పోలీసులు ఆధ్వర్యంలో ర్యాలీ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News