Thursday, January 23, 2025

మూడు నెలల తర్వాత సమావేశమైన తెలంగాణ వక్ఫ్‌బోర్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మూడు నెలల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశం మంగళవారం హజ్ హౌస్‌లోని వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో జరిగింది. చైర్మన్ మసిఉల్లాఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 85 ఎజెండా అంశాలను చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. వీటిలో చాలా వరకు వివిధ కమిటీలకు సంబంధించినవి కాగా మరికొన్ని ముతవల్లీలకు సంబంధించినవి ఉన్నట్లు సమాచారం. అయితే బోర్డు సమావేశానికి వారం రోజుల ముందు ఎజెండాను సభ్యులకు ఇవ్వాల్సి ఉండగా ఒక రోజు ముందే ఎజెండా ఇచ్చి చర్చకు అవకాశం లేకుండా చేశారని ఏకపక్షంగా వాటిని ఆమోదించుకోవడం జరిగిందని అసోసియేషన్ ఆఫ్ సేవ్ వక్ఫ్‌ప్రాపర్టీస్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇఫ్తెఖార్ హుస్సేన్ అన్నారు.

ప్రతి నెలా బోర్డు సమావేశం జరుగాల్సి ఉండగా గత మూడేళ్ళుగా సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే సమావేశమై తమకు కావాల్సిన అజెండాను ఆమోదింపచేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. వక్ఫ్‌బోర్డు అవినీతికి అడ్డాగా మారిందని, బోర్డులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని బోర్డు వ్యవహారాలన్నింటిపై నిస్పక్ష విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బోర్డులో కొందరి వ్యవహారశైలి వల్ల ప్రభుత్వానికి చెడుపేరు వస్తోందని పేర్కొన్నారు,. బోర్డు వ్యవహారాల్లో పారదర్శకత లేకుండా పోయిందని ఆయన అన్నారు. అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారులు, బోర్డు సభ్యులకు సంబంధించిన సమస్యలను క్షుణ్ణంగా విచారించడం అత్యవసరమని ఆయనన్నారు. ముతవల్లీల పేరుతో గణనీయమైన నిధులను కేటాయించినట్లు నివేదికలు ఉన్నాయని, ఈ నిధులను వారి ఉద్దేశించిన ప్రయోజనాల కోసం వినియోగించేలా చూసుకోవడం చాలా అవసరమని ఆయనన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News