Friday, December 20, 2024

వెబ్‌సిరిస్‌గా తెల్గీ జీవితకథ..

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశంలో 2003 ప్రాంతంలో జరిగిన స్టాంప్ పేపర్ల భారీ కుంభకోణం సంబంధిత వాస్తవికతల ఆధారంగా ఓ వెబ్‌సీరిస్ రూపొందింది. స్కామ్ 2003 పేరిట ఈ వెబ్‌సిరిస్ శుక్రవారం ఒటిటి సోనీలివ్‌లో విడుదలైంది. దీనికి ది తెల్గీ స్టోరీ అనే శీర్షికను కూడా తగిలించారు. తుషార్ హీరానందన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్‌సిరిస్‌లో తెల్గీ పాత్రను గగన్ దేవ్ రియార్ పోషించారు. నిజంగానే తెల్గీనా అనే భ్రాంతి కల్పించారని ప్రశంసలు వెలువడుతున్నాయి. ఎటువంటి వ్యాపారాలకు, అక్రమాలకు అయినా రాజకీయ నాయకులే కీలకం అని ఆసుపత్రి బెడ్ మీద తెల్గీ పాత్రధారి చెప్పడం స్కామ్‌ల రాజకీయాలను తెలియచేస్తుంది. కర్నాటకలోని ఖానాపూర్‌కకు చెందిన అబ్దుల్ కరీం తెల్గీ పట్టభద్రుడు.

ఎంతకూ ఉద్యోగం దొరకకపోవడంతో చివరికి రైళ్లలో పండ్లు అమ్ముకుంటూ గడుపుతాడు. ఈ దశలో అందరితో కలివిడిగా ఉండటం నైజం అయింది. రైలులోనే ఆయనకు పరిచయం అయిన షౌకత్ ఖాన్‌తో తెల్గీ జీవితం మలుపులు తిరుగుతుంది. ఉద్యోగం ఉపాధికోసం ముంబైకు వెళ్లుతాడు. ఖానాపూర్ నుంచి మాసిన బట్టలు, చేతుల్లో చిరిగిన సంచీతో మహానగరం ముంబైకి చేరిన తెల్గీ వేల కోట్ల స్కామ్ ఏ విధంగా చేయగలిగాడనేది ఈ సిరీస్‌లో చిత్రీకరించారు. తాను డబ్బు సంపాదించను అని, డబ్బు సృష్టిస్తానని చెప్పిన తెల్గీ తన అక్రమాల క్రమంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికార యంత్రాంగం స్కామ్‌లకు ఏ విధంగా ఉపయోగపడుతుందనేది పసికట్టి ముందుకు సాగినట్లు కథనం వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News