Monday, November 25, 2024

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఫౌంటెన్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో కరీంనగర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానే రివర్ ఫ్రంట్ లో భాగంగా వాటర్ ఫౌంటెన్ పనులను ఆగస్టు 15లోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో ఇరిగేషన్, టూరిజం, వాటర్ ఫౌంటెన్ నిర్మాణ ఏజెన్సీ లతో నిర్వహించిన సమావేశంలో వాటర్ ఫౌంటెన్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో సీయోల్, చైనా దేశాల తర్వాత 3వ అతిపెద్ద ఫౌంటెన్ కరీంనగర్లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ 35 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ఫౌంటెన్ నిర్మాణంతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రత్యేక కళా సంతరించుకో నుందని తెలిపారు. ఈ వాటర్ ఫౌంటెన్ పనులను వేగవంతంగా చేపట్టి ఆగస్టు 15లోగా పూర్తిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, ఇరిగేషన్ ఈఈ నాగభూషణం, టూరిజం కార్పొరేషన్ ఎఇ జీవన్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య, వాటర్ ఫౌంటెన్ నిర్మాణ ఏజెన్సీ ఇంజనీర్ అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News