Sunday, December 22, 2024

యువకుడిని కొట్టి చంపి దోచుకున్న దుండగులు

- Advertisement -
- Advertisement -

రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని దుండగులు కొట్టి చంపి దోచుకున్న దారుణ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ లో డిసెంబర్ 5వ తేదీన వరంగల్ బస్టాండ్ వద్ద రాకేష్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా ఆటోల వచ్చిన యువకులు అతడిపై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారం గొలుసు ఉంగరాలను దోచుకెళ్లారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న రాకేష్ ను స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాకేష్ బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News