Wednesday, January 22, 2025

ఉత్పత్తి రవాణాకు ఆటంకం లేకుండా చూడాలి

- Advertisement -
- Advertisement -

రామగిరి: వర్షాల కారణంగా ఉత్పత్తి, రవాణాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాలని ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్‌వీకే శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆర్జీ 3 ఏరియా, ఏపీఏ ఏరియాల్లో మైనింగ్ ఆడ్వైజర్ డీఎస్ ప్రసాద్‌తో కలిసి ఆయన ఏఎల్‌పీ గని, ఓసీపీ 2 ఉపరితల గనిని సందర్శించి, నడుస్తున్న పనులను పరిశీలించారు.అనంతరం జీఎం కార్యాలయంలో ఆర్జీ 3 జీఎం సుదాకర్‌రావు, ఏపీఏ జీఎం వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

నా రక్షణ, నా బాధ్యత అని ఎవరు కూడా మరువరాదని, వర్షాకాలంలో ఉపరితల గనులలో నిలిచే నీటిని పంపుల ద్వారా ఎప్పటికప్పుడు బయటికి పంపించే ఏర్పాటు చేయాలన్నారు. తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆయా విభాగాల అధిపతులు సీతారామం, బైద్య, జైనుల్లాబద్దీన్, రాధాకృష్ణ, నాగేశ్వరరావు, రాజేందర్, నాగరాజులతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News