Thursday, January 23, 2025

కాంగ్రెస్‌లో చేరిన గిరిజన తండా ప్రజలు

- Advertisement -
- Advertisement -

నందిగామ: తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తమ తాండాలకు ఓరిగిందేమీలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నందిగామ మండల పరిధిలోని మూడు తండాలకు చెందిన గిరిజనులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కండువాలు వేసి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం తడాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిందని, కానీ నిధులు విడుదల చేయకుండా తాండాలను అభివృద్ధికి ఆమడదూరంలో పెట్టిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై విసుగు చెందిన గిరిజనులు 70మందికిపైగా కాంగ్రెస్‌పార్టీలో చేరారన్నారు. పెద్దకుంటతాండ, బండకుంట తండా, మధ్య తండాలకు చెందిన గిరిజనులకు కనీసం తాగేందుకు మంచినీరులేదన్నారు. అండర్‌డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని, వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి సమయాల్లో తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారన్నారు.

కాంగ్రెస్‌ను ఆదరించి గెలిపిస్తే గిరిజన తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రజలు ఆనందంగా ఉండాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, దేపల్లి కుమారస్వామిగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జంగ నర్సింహా, సోమ్లానాయక్, గోవిందునాయక్, శ్రీనునాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News