Monday, December 23, 2024

కనిష్ఠ స్థాయి నుంచి పుంజుకున్న రూపాయి విలువ !

- Advertisement -
- Advertisement -

29 పైసలు పెరిగి డాలరుకు రూ. 83.33 చేరిన రూపాయి విలువ

ముంబై: డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ కనిష్ఠ స్థాయి నుంచి వృద్ధి చెందింది. మంగళవారం 29 పైసలు పెరిగి డాలరు మారకం విలువ రూ. 83.33కు చేరింది. ఇంటర్ బ్యాంక్ ఎక్స్ఛేంచ్ లో అత్యధికంగా 83.33, అత్యల్పంగా 83.32 లో ట్రేడయి దాదాపు 29 పైసలు పెరిగింది. హోలి పండుగ కారణంగా సోమవారం ఫారెక్స్, ఈక్విటీ మార్కెట్లు మూసి ఉంచారు. భారత ఫారిన్ ఎక్స్ఛేంచ్ నిల్వలు 6.396 బిలియన్ డాలర్లు పెరిగి 642.492 బిలియన్ లకు మార్చి 15 నాటికి చేరుకున్నట్లు భారత రిజర్వు బ్యాంకు శుక్రవారం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News