Thursday, January 23, 2025

పల్లెలు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్: తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మం డల పరిధిలోని పర్సాపూర్‌లో జరిగిన పల్లెప్రగతి వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ద్వారా పల్లెల రూపురేకలు మారాయన్నారు. పారిశుధ్యం, పచ్చదనం ద్వారా స్వచ్చమైన గ్రా మాలుగా వెలిగిపోతున్నట్లు కొనియాడారు. తెలంగాణ రాకముందు వచ్చిన తరువాత గ్రామాల్లో అనేక సౌకర్యాలు పేరిగాయన్నారు.

ఇచ్చిన మాట మేరకు సీఎం 500 జనాభా ఉన్న తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చినట్లు గుర్తుచేశారు. గ్రామాల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసినట్లు తెలపారు. అంత కుముందు జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ముందు జాతీ య పతాకాన్ని ఎమ్మెల్యే అవిష్కరించారు. కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. గ్రామ పంచాయ తీ పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌తో పాటు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News