Sunday, December 22, 2024

పాఠశాలకు తాళం వేసిన గ్రామస్తులు

- Advertisement -
- Advertisement -

మల్దకల్ : మండల పరిధిలోని శేషంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉపాధ్యాయురాలు పాఠశాలకు క్రమంగా రాకపోవడం వల్లే విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని సర్పంచుతో కలిసి గ్రామస్తులు ప్రాథమిక పాఠశాలకు తాళం వేశారు.

ప్రభుత్వం లక్షలు వెచ్చించి విద్యను అందించాలని ఇక్కడ టీచర్లను నియమిస్తే వారు చదువు చెప్పకుండా విధులకు గైర్హజరై పిల్లలను విద్యకు దూరం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఉపాధ్యాయురాలిని తొలగించి ఈమె స్థానంలో మరో ఉపాధ్యాయులను నియమించి మా పిల్లలకు మెరుగైన విద్యను అందించేలా చూడాలని విద్యార్థి తల్లిదండ్రులు విద్య శాఖ అధికారులను డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News