Monday, December 23, 2024

విఆర్‌ఏలను క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించారు

- Advertisement -
- Advertisement -

వారి కుటుంబాల్లో సిఎం కెసిఆర్ వెలుగులు నింపారు
ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: విఆర్‌ఏలను క్రమబద్ధీకరణ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించి వారి కుటుంబాల్లో సిఎం కెసిఆర్ వెలుగులు నింపారని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అన్నారు. వివిధ శాఖలో చేరిన పలు జిల్లాలకు చెందిన విఆర్‌ఏలు ట్రెసా నాయకులను కలిసి.. మునిసిపల్ శాఖలో వార్డు ఆఫీసర్లుగా 1200ల మందిని నియమంచారని, వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని వారు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో నూతన సంస్కరణలకు నాంది పలికి నూతన శకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 23,000ల విఆర్‌ఏలను క్రమబద్దీకరించడం రికార్డు అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విఆర్‌ఏలు సూచించిన సమస్యను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. ఈ సమావేశంలో రమన్ రెడ్డి, సైదులు, వాణి, నజీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News