Monday, December 23, 2024

ఆ విషయాన్ని ’ది వారియర్’ మరోసారి నిరూపించింది

- Advertisement -
- Advertisement -

పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు రామ్ పోతినేని నటించిన సినిమా ’ది వారియర్’. ఇందులో కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి విలన్. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ మాట్లాడుతూ ”సినిమా విడుదల సమయంలో వర్షాలు ఉన్నాయి. అడ్డంకులు చాలా వచ్చాయి. అయితే వర్షాలు వచ్చినా… ఏం వచ్చినా… థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని ’ది వారియర్’ మరోసారి నిరూపించింది. లింగుస్వామి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను.

’ది వారియర్’తో కృతి అందరికీ బేబీ అయిపోయింది. ఆది పినిశెట్టి ప్రాణం పెట్టి సినిమా చేశారు” అని అన్నారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ.. “ఈ సినిమాకు చాలా పెద్ద ఆదరణ లభించింది. ఈ ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూశా. ఆ క్రౌడ్, ఆ ఓపెనింగ్ సూపర్. హీరో రామ్ క్రేజ్ తెలుసు. తమిళంలో విజయ్, అజిత్ లాంటి మాస్ హీరోలకు ఎలాంటి క్రౌడ్ వస్తుందో… అటువంటి మాస్ క్రౌడ్ మధ్య చూశా. ప్రేక్షకులు ఎక్కడ కనెక్ట్ అవుతారని అనుకున్నామో అక్కడ కనెక్ట్ అవుతున్నారు” అని తెలిపారు. ఈ వేడుకలో కృతి శెట్టి, ఆది పినిశెట్టి, శ్రీనివాసా చిట్టూరి, పవన్ కుమార్, విజయ్, డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

THE Warrior Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News