Monday, December 23, 2024

పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా?!..’ది వారియర్’ టీజర్

- Advertisement -
- Advertisement -

THE WARRIOR Teaser Released

“సత్య… సత్య ఐపీఎస్… డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన అంటే రౌడీలకు హడల్, గుండాలకు గుబుల్. వయోలెంట్‌గా కొడతాడు! వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు! అతడి కథేంటో తెలియాలంటే… ముందు ‘ది వారియర్’ టీజర్ చూడాల్సిందే”అని అంటున్నారు ఫిల్మ్‌మేకర్స్. సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ నటిస్తున్న సినిమా ’ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది ఈ చిత్రం. మే 15న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం సినిమా టీజర్ విడుదల చేశారు. ‘ది వారియర్’ టీజర్‌లో హీరో రామ్ క్యారెక్టర్‌తో పాటు విలన్ రోల్ చేస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతి శెట్టి, నదియా క్యారెక్టర్లను కూడా పరిచయం చేశారు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ ఫెరోషియస్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అని చెప్పాలి.

హీరోను లింగుస్వామి బాగా చూపించారు. టీజర్‌లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ మాత్రమే కాదు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు టీజర్‌లో చోటు ఇచ్చారు. “డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సత్య పోరీని నేను” అని కృతి శెట్టి చెప్పడమే కాదు, రామ్‌తో రొమాన్స్ చేయడమూ చూపించారు. ‘ఆట బానే ఉంది, ఆడేద్దాం” అంటూ ఆది పినిశెట్టి చెప్పడం, ఆయన గెటప్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. “పాన్ ఇండియా సినిమా చూసుంటారు. పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా?”, “మై డియర్ గ్యాంగ్‌స్టర్స్ వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్‌” అంటూ రామ్ చెప్పే డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. స్క్రీన్ మీద రామ్, స్క్రీన్ వెనుక లింగుస్వామి అద్భుతంగా చేశారు. ఊర మాస్ విజువల్ గ్రాండియర్ అని ఆడియన్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. ఒక్క పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ పాటను ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి” అని చెప్పారు.

THE WARRIOR Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News