Thursday, January 23, 2025

కమాన్ బేబీ… లెట్స్ గో ఆన్ ద బుల్లెట్

- Advertisement -
- Advertisement -

the warrior telugu movie

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ’ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. సినిమాలోని తొలి పాట, ప్రముఖ తమిళ హీరో శింబు పాడిన ’బుల్లెట్…’ను శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ‘బుల్లెట్…’ సాంగ్ తమిళ్ వర్షన్‌ను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా హీరో రామ్, నిర్మాత శ్రీనివాసచిట్టూరి, హీరోయిన్ కృతి శెట్టి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, ఆది పినిశెట్టి, చిత్రసమర్పకులు పవన్ కుమార్, ఛాయాగ్రాహకుడు సుజీత్ వాసుదేవ్, కళా దర్శకుడు డి.వై. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ఎనర్జిటిక్ ట్యూన్ అందించగా తెలుగులో శ్రీమణి అంతే హుషారైన సాహిత్యం అందించారు. తమిళ వర్షన్‌కు వివేక్ లిరిక్స్ రాశారు. శింబుతో పాటు హరిప్రియ ఆలపించారు. ‘కమాన్ బేబీ… లెట్స్ గో ఆన్ ద బుల్లెట్! ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోలో రామ్, కృతి శెట్టి జోడీవేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ‘బుల్లెట్…’ సాంగ్ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ “సాంగ్ చాలా బావుంది.

‘ది వారియర్’ సినిమా రామ్ నటించిన విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలవాలి”అని చెప్పారు. రామ్ మాట్లాడుతూ “లింగుస్వామి ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఆదిపినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారని చెప్పారు. నేను షాక్ అయ్యా. ఆదితో నటించడంమంచి ఎక్స్‌పీరియన్స్. దర్శకుడు లింగుస్వామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించారు” అని అన్నారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ “’బుల్లెట్…’ సాంగ్ కోసం మా నిర్మాత మూడు కోట్లు ఖర్చుపెట్టారు. సినిమాను గ్రాండ్‌గా తీశారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్, శ్రీనివాసా చిట్టూరి, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News