Monday, December 23, 2024

‘వారియర్ 2’ కూడా చేస్తాము

- Advertisement -
- Advertisement -

పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. అనంతపురంలో అభిమానులు, ప్రేక్షకుల మధ్య జరిగిన కార్యక్రమంలో ‘ది వారియర్’ ట్రైలర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ పోతినేని మాట్లాడుతూ “మంచి మనసున్న మనిషి లింగుస్వామి. తెలుగులో చాలా కమర్షియల్ హిట్స్ అయిన సినిమాల్లోని సీన్లు లింగుస్వామి సినిమాల్లోని సీన్లు చూసి స్ఫూర్తి పొందినవి. ఈ విషయాన్ని నాకు ఆయా దర్శకులు వచ్చి చెప్పారు. ‘ది వారియర్’ జూలై 14న విడుదలవుతోంది. థియేటర్లలో కలుద్దాం” అని అన్నారు. చిత్ర దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ “తెలుగు సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో కుదిరింది. ఇక ‘వారియర్ 2’ కూడా చేస్తాము” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆది పినిశెట్టి, కృతి శెట్టి, శ్రీనివాసా చిట్టూరి, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

‘THE WARRIOR’ Trailer launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News