Thursday, January 23, 2025

రాజీ మార్గమే రాజ మార్గం

- Advertisement -
- Advertisement -

మెదక్: 10న జరుగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా యెస్.పి రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…… రాజీపడే కేసులలో రాజీపడేటట్లు ఫిర్యాది, ముద్దాయి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడే అవాకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని జిల్లా కోర్ట్ కానిస్టేబుళ్లను యెస్.పి ఆదేశించారు. అలాగే నేషనల్ లోక్ అదాలత్ కేసులో రాజీ అయ్యేటట్లు ప్రతి పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలు ఛాలెంజ్ గా తీసుకొని కేసుల్లో ఉన్న ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. మెగా లోక్ అదాలత్ లో సాధ్యమైనంత వరకూ ఎక్కువ కేసులు రాజీ చేయించాలన్నారు.

రాజీ పడదగిన కేసుల్లో ఉన్నవారిని పిలిపించి చిన్నచిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఒకే గ్రామంలో ఉండే వారు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి రాజీ మార్గం రాజ మార్గమని వారికి అర్థమయ్యే విధంగా తెలపాలని సూచించారు. లిస్ట్ అవుట్ చేసిన కేసులలో అన్ని కేసులు రాజీ పడేటట్లు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. న్యాయస్థాన అధికారులతో లైజనింగ్ ఏర్పరచుకొని విధులు నిర్వహించాలని సూచించారు. లోక్ అదాలత్ లో సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో కేసులు డిస్పోజల్ అయ్యేటట్లు చూడాలని తెలిపారు.

నేరస్తులకు పోక్సో, మర్డర్, రేప్, ఇతర గ్రేవ్ కేసులలో నేరస్తులకు శిక్షలు పడేలా సాక్షులకు బ్రీఫింగ్ ఇవ్వాలని సూచించారు. కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి కేసులలో శిక్షల శాతం పెంచాలని సూచించారు. ఈ రాజీ కేసులు మెదక్ పట్టణంలోని మెదక్ కోర్ట్ కాంప్లెక్స్ ఆవరణలో 10న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహింపబడుతుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News