Sunday, December 22, 2024

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

ఘట్‌కేసర్: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ, 11వ, 13వ వార్డులలో 30 లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావనితో కలిసి శుక్రవారం శంకుస్థాపనలు చేశారు.

అనంతరం మైసమ్మగుట్ట వద్ద మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఇలాంటి సంక్షేమం ఎప్పుడు చూడలేదని తెలిపారు. మహిళలు అర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కమిషనర్ వేమనరెడ్డి, కౌన్సిలర్లు బండారి అంజనేయులు గౌడ్, కొమ్మిడి అనురాధ, కడుపోల్ల మల్లేష్, జహంగీర్, బండారి వసంత, బేతాల నర్సింగ్‌రావు, కుతాడి రవీందర్, కో ఆప్షన్ సభ్యులు బొట్టు అరుణ, ఎస్ కే. షౌకత్ మియా, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపాల సుధాకర్ రెడ్డి, నాయకులు సార శ్రీనివాస్ గౌడ్, మేకల నర్సింగ్ రావు, మందడి శ్రీనివాస్ రెడ్డి, బొంత సుధాకర్, బర్ల హరిశంకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News