Thursday, January 23, 2025

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

వాంకిడి: సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆమె రైతులకు ఎరువులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ కంటే తక్కుత ధరకు వ్యవసాయ సహాకార సంఘం ద్వారా రైతులకు ప్రభుత్వం ఎరువులను అందిస్తుందని, కొనుగోలు చేసి, వ్యవసాయానికి వినియోగించుకోని రైతులు అధిక ప్రయోజనాన్ని పొందాలని అన్నారు.

రైతులకు ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారికి కావాల్సిన అన్ని రకాల ఎరువులు, విత్తనాలను వ్యవసాయ సహాకార సంఘం కార్యాలయం ద్వారా తమ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అజయ్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ పెంటు, వైస్ చైర్మన్ నేపాజీ, సర్పంచ్ బండే తుకారాం, ఏఓ మిలింద్‌కుమార్, ఖమాన మాజీ ఎంపిటిసి దేవినేని గోల్ల, నాయకులు ముండే దీపక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News