Monday, December 23, 2024

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను పారిశుధ్ద పనులను ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల వలే కలిసి మెలిసి ఉంటారని, ఎలాంటి కలహాలకు ఇక్కడ తావులేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మసీదులకు, షాదిఖానాలకు, అశుర ఖానాలకు, ఖబరస్తాన్‌ల అభి వృద్ధి కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. మైనార్టీ పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌గా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తోందన్నారు. మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజన్‌లకు నెల నెలా ఫించన్ అందిస్తున్నామన్నారు. తెలంగా ణలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముఖ్య పండుగలను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా జరుపుతోందన్నారు.

మైనార్టీల కోసం గురుకులా లను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై ప్రతి యేటా లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. ఇలాంటి గురుకులాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. షాదిముబారక్ ద్వారా నిరుపేద ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. అన్ని మతాలను గౌరవి స్తూ సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.

ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగ ఏర్పాట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోందన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ వెంట మున్సిపల్ చైర్మన్ గోళి శ్రీనివాస్, కమిషనర్ డాక్టర్ నరేష్, డిఇ రాజేశ్వర్, కౌన్సిలర్ పంబాల రాము, ఎఎంసి వైస్ చైర్మన్ ఆసిఫ్, నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, తాజొద్దిన్ సుధాకర్‌రావు, చాంద్ పాషా, కుస్రు హజారీ, ఫిరోజ్, జాబీర్, అహ్మద్, అజ్గర్‌షా, ఖలీమ్, జహంగీర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News