- ఆది నుంచే రైతులంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు
- రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డి
- నాడు ధరణి పోర్టల్‌ను వ్యతిరేకించిన కాంగ్రెస్
- నేడు రైతు ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు
- కేవలం అధికారం కోసమే కాంగ్రెస్ ఆరాటం
- కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్
హుస్నాబాద్: ఆది నుంచి కాంగ్రెస్‌కి రైతులంటే చిన్న చూపే అని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. రైతుల వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి వ్యతిరేకంగా గురువారం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో బాగంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి కార్యక్రమంలో హన్మకొండ జిల్లా జడ్పీ చైర్‌పర్పన్ డాక్టర్ మారేపల్లి సుదీర్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనైనా రాష్ట్రంలో నైనా కాంగ్రెస్ రైతుల కష్టాలను ఏనాడు పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ రైతుల ఆర్థిక ఆభివృద్ధికి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని ఓర్వలేని కాంగ్రెస్ నాడు ధరణి పోర్టల్‌ను వ్యతిరేకించారని ప్రస్తుతం రైతులకు ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం రైతులపై వారి కపట ప్రేమకు నిదర్శనం అన్నారు. రైతుల ప్రయోజనాలు కాకుండా కేవలం కాంగ్రెస్ అధికారం కోసమే ఆరాటపడుతుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నఘనత సిఎం కెసిఆర్ దక్కుతుందన్నారు. స్వరాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసుకొని రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్ అందించడంతో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్న రైతులను కాంగ్రెస్ మల్లీ చీకట్లోకి నెట్టేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొట్టాలని సూచించారు.
ఉచిత విద్యుత్ పై దురహంకార వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికే చెల్లుతాయని రైతులు రైతు వ్యతిరక కాంగ్రెస్‌ని గమనిస్తున్నారన్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో రైతు వ్యతిరేకి రాబందు కాంగ్రెస్‌ని ప్రజలు భూస్థాపితం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీహరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, ఎంపిపి లకావత్ మానస, లక్ష్మిబిలు నాయక్, జడ్పిటిసి భూక్య మంగ, ఎఎంసి చైర్మన్ ఎడబోయిన రజిని ప్రజాప్రతినిధులు, నాయకులు వెంకట్రాంరెడ్డి, అన్వర్, గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపిపి ఆకుల వెంకట్, తిరుపతిరెడ్డి, ఆశోక్ బాబు, రమేశ్‌నాయక్, పరుశరాములు, చిరంజీవి, క్రాంతిరెడ్డి, సంపత్, ఇంతియాజ్, అనిల్ కుమార్ గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.