Monday, December 23, 2024

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని : రామగుండం నియోజక వర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తాను ముందుకు సాగుతున్నానని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని మార్కండేయకాలనీ లక్ష్మి పంక్షన్ హాల్‌లో రామగు ండం కార్పొరేషన్ ఏరియా ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రామగుండం ని యోజక వర్గంలోని ఆటో డ్రైవర్లు అంతా తమ కుటుంబ సభ్యులేనని, వారందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నానని అన్నారు. ఆ టో డ్రైవర్లందరికీ డ్రెస్ కోడ్ ఇస్తామని, వారి తామే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు.

రామగుండం నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధిపై ఆటో అన్నలందరూ చర్చ పెట్టాలని, రామగుండం మెడికల్ కళాశాల తీసుకు వచ్చింది, సబ్ రిజిస్టర్ కార్యాలయం, సబ్ సివిల్ కోర్టు తీసుకు వచ్చింది ఎవరో తమ ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రజలకు వివరించాలని అన్నారు.

ప్రచార సాధకులుగా ఆటో డ్రైవర్లు చర్చ చేయాలని అన్నారు. కార్యక్రమంలో తానిపర్తి గోపాల్ రావు, గోపు అయిలయ్య యాదవ్, దయానంద్ గాంధీ, గౌస్ పాషా, వంగ శ్రీనివాస్, హఫీజ్, ఆటో యూనియన్ నాయకులు ఈర్ల అయిలయ్య, నీలారపు రవి, మాటేటి రాజేశం, రాజు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News