Monday, December 23, 2024

పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం : మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్: పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 13, 12, 27, 11, 10,22, 9, 20, 5 డివిజన్‌లలో రూ.9 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకోవడానికి సీఎం కెసిఆర్ దళితబంధుతో మరోసారి రూ.10లక్షలు,కుల వృత్తులను ఆదుకోవడానికి రూ.1లక్ష, గృహలక్ష్మీపథకంతో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు అందిస్తున్నాడని పేర్కొన్నారు.

తెలంగాణ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలోను లేవవి ఆ ఘనత సీఎం కెసిఆర్‌దేనని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి జవహర్‌నగర్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని, దాదాపు 150 కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందించానని, చెత్త డంపింగ్‌యార్డ్ సమస్యను దాదాపు పరిష్కరించినట్లు తెలిపారు. 5వ డివిజన్‌లో సిసి కెమోరాలను మంత్రి ప్రారంభించారు.

కాగా కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్‌లలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి ఉదయం 8గంటలకే జవహర్‌నగర్‌కు రాగా నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ప్రతి డివిజన్‌లో కార్పొరేటర్లు పోటీ పడి విభిన్నంగా స్వాగతం పలికారు. డప్పుచప్పట్లతో బాణసంచా కాల్చి మంత్రికి స్వాగతం పలికారు. దీంతో జవహర్‌నగర్‌లో ఎన్నికల హడావిడి ముందే కనబడింది. మంత్రి సైతం ప్రతి కార్యకర్తను పలుకరించి మా ట్లాడుతూ ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,కోఆప్షన్ సభ్యులు, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజు, జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ ఆలూరి రాజశేఖర్, శంకర్‌గౌడ్, మున్సిపల్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News